TG | ర‌క్ష‌ణ శాఖ‌తో తెలంగాణ స‌ర్కార్ ఒప్పందం – కంటోన్మెంట్ భూములకు లైన్ క్లియర్

కంటోన్మెంట్ భూములు ఇచ్చేందుకు ర‌క్ష‌ణ శాఖ రెడీ
శామీర్ పేట భూములు వారికి ఇవ్వ‌నున్న స‌ర్కార్
ఎంఒయు పై అధికారులు సంత‌కాలు
జెబిఎస్ నుంచి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మార్గం సుగ‌మం

హైద‌రాబాద్ – రక్షణ శాఖతో తెలంగాణ ప్రభుత్వం నేడు కీలక ఒప్పందం చేసుకుంది. జేబీఎస్ నుంచి శామీర్ పేట్, ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ల కోసం కంటోన్మెంట్ భూములు ఇవ్వడానికి రక్షణ శాఖ సిద్ధమైంది. రక్షణ శాఖ భూములు ఇచ్చినందుకు ప్రతిగా.. శామీర్ పేట్ లో భూములను తెలంగాణ సర్కార్ ఇవ్వనుంది. ఈ మేర‌కు నేడు రక్షణ శాఖతో ఎం ఓ యు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఇరు శాఖ‌ల‌కు చెందిన సీనియ‌ర్ అధికారులు ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేశారు.. దీంతో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం 90 ఎకరాల భూములను కేంద్ర రక్షణ శాఖ ఇవ్వనుంది.

రక్షణ శాఖ భూముల కారణంగా లేట్ అవుతున్న ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులు.. ఈ ఒప్పందం పూర్తయితే ఎలివేటెడ్ కారిడార్ పనులు మరింత స్పీడ్ కానున్నాయి. స్టేట్ హైవే- 1 పై జేబీఎస్ నుంచి శామీర్ పేట్ వరకు 22 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ తో పాటు నేషనల్ హైవే- 44 పై ప్యారడైజ్ నుంచి డైరీ ఫామ్ వరకు 5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది.

Leave a Reply