55yrs | రోడ్డు ప్రమాదంలో తండ్రి…

55yrs | రోడ్డు ప్రమాదంలో తండ్రి…

55yrs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొడుకు పెళ్లి వేడుకల సందడిలో ఉండాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. దేవురుప్పుల మండలం బంజర తండాకు చెందిన జోగు సోమయ్య(55) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

శుక్రవారం రాత్రి పెళ్లి కార్యక్రమాల కోసం ట్రాక్టర్‌లో ఫంక్షన్ హాల్‌కు కట్టెలు తీసుకెళ్తుండగా వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డబ్బా కింద పడిన సోమయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు వెంటనే ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కొడుకు వివాహానికి ఒక్క రోజు ముందు తండ్రి మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది.

Leave a Reply