50th match Iటాస్ గెలిచిన ఆర్సీబీ
50th match I టాస్ గెలిచిన ఆర్సీబీ
50th match I ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు లక్నోలోని ఏకానా స్టేడియంలో ఆసక్తికర పోరు మొదలైంది. లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న ఈ 50వ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఈ సీజన్‌లో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాల్లో కొనసాగుతుండగా, లక్నో సూపర్ జెయింట్స్ వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. రిషబ్ పంత్ నాయకత్వంలోని లక్నో జట్టుకు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలుపు అనివార్యం.
తుది జట్లు :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ.
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లిస్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్ & కీపర్), ఐడెన్ మార్క్రామ్, అక్షత్ రఘువంశీ, హిమ్మత్ సింగ్, మహమ్మద్ షమీ, మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, అవేష్ ఖాన్.
