41 Match | నేడు ఐపీఎల్‌లో ముంబై, హైద‌రాబాద్ ఢీ

41 Match | నేడు ఐపీఎల్‌లో ముంబై, హైద‌రాబాద్ ఢీ

41 Match | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఇవాళ ఐపీఎల్ 2026లో 41వ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌ర‌గ‌నున్న బిగ్ ఫైట్ కోసం అభిమానులు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. రెండు పెద్ద జ‌ట్ల మధ్య భీక‌ర పోరు జ‌ర‌గ‌నుంది. రాత్రి 7.30 గంట‌ల‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో ముంబై ఇండియ‌న్స్‌ కీల‌క పోరుకు సిద్ధ‌మ‌వుతోంది. వాంఖ‌డే స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ మ్యాచ్ ముంబై ఇండియ‌న్స్‌కు చావోరేవో మ్యాచ్ లాంటిది. ఎందుకంటే వ‌రుస ప‌రాజ‌యాల‌తో కొట్టుమిట్టాడుతోంది. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏడు మ్యాచ్ లు ఆడింది. కేవ‌లం రెండు మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించింది. మ‌రో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. నెట్‌ర‌న్‌రేటు -0.736గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్ రేసులో నిల‌వాలంటే ముంబై ఈ మ్యాచ్‌లో త‌ప్ప‌నిస‌రిగా విజ‌యం సాధించాల్సిందే. హైద‌రాబాద్ జ‌ట్టు మాత్రం మంచి ఫామ్‌లో ఉంది. వ‌రుస విజ‌యాల‌తో టేబుల్ టాప్ 4లో ఉంది.

ప్రస్తుతం SRH 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. నెట్ ర‌న్‌రేట్‌ +0.815గా ఉంది. ఈ సీజన్‌లో SRH బ్యాటింగ్ దాడి భయంకరంగా ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లకు ఏ పిచ్‌పైనైనా ధ్వంసం చేసే సత్తా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు స‌న్‌రైజ‌ర్స్, ముంబై జ‌ట్లు 34 సంద‌ర్భాల్లో ముఖాముఖిగా త‌ల‌ప‌డ్డాయి. ఇందులో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 19 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. మ‌రో 15 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియ‌న్స్ గెలుపొందింది.

Leave a Reply