suicide | ఇద్దరినీ ఒకే దగ్గర ఖననం
suicide | ఇద్దరినీ ఒకే దగ్గర ఖననం
suicide | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైఎస్ఆర్ కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిన్నపాటి మనస్పర్థలతో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడగా, వారి ప్రేమకు గుర్తుగా కుటుంబసభ్యులు ఇద్దరినీ ఒకేచోట ఖననం చేయడం హృదయ విదారకంగా మారింది.
చెన్నూరుకు చెందిన యోగేంద్రకుమార్ వర్మ (19), హేమశ్రీ (19) కడపలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చదువుతూ ప్రేమలో పడ్డారు. కులాలు వేరు కావడంతో ముందుగా చదువుకుని జీవితంలో స్థిరపడిన తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఇటీవల ఇద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన యోగేంద్ర కుమార్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హేమశ్రీ కూడా బలవన్మరణానికి పాల్పడింది.
ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. కలిసి జీవించలేకపోయిన ఈ ప్రేమజంటను కనీసం మరణంలో అయినా కలిపి ఉంచాలని కుటుంబసభ్యులు నిర్ణయించి, చెన్నూరు సమీపంలో ఒకే చోట ఖననం చేసి అంత్యక్రియలు నిర్వహించారు.
