రాజ్యసభ పయనానికి కనకదుర్గమ్మ ఆశీస్సులు..

రాజ్యసభ పయనానికి కనకదుర్గమ్మ ఆశీస్సులు..

విజయవాడ (ఆంధ్రప్రభ): రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన సందర్భంగా భాష్యం రామకృష్ణ సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భార్య, కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయన, శ్రీ కనకదుర్గమ్మతో పాటు శ్రీ మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. తన నూతన రాజకీయ ప్రస్థానం విజయవంతం కావాలని, ప్రజాసేవలో మరింత సమర్థంగా ముందుకు సాగేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించారు.

దర్శనం అనంతరం ఆలయ పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య భాష్యం రామకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్ ఆయనను ఆలయ మర్యాదలతో సత్కరించి అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, పవిత్ర చిత్రపటాన్ని అందజేశారు.

రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో కనకదుర్గమ్మ ఆశీస్సులు పొందడం తనకు ఆధ్యాత్మిక బలాన్ని, ప్రజాసేవకు మరింత ప్రేరణను అందిస్తుందని భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు.

ఆలయ ప్రాంగణంలో భక్తులు, పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply