ATM | అనుమానాస్పద మృతి కేసు నమోదు

ATM | అనుమానాస్పద మృతి కేసు నమోదు

ATM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాసబ్‌ట్యాంకు ప్రాంతంలో ఏటీఎంలో వ్యక్తి మృతదేహం బయటపడటంతో కలకలం రేగింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

విజయనగర్ కాలనీలోని ఓ బ్యాంక్ ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న మెహదీపట్నం పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు మరణమా? లేక హత్య జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply