కనకదుర్గమ్మ నిత్య అన్నదానానికి రూ.1.01 లక్షల విరాళం
కనకదుర్గమ్మ నిత్య అన్నదానానికి రూ.1.01 లక్షల విరాళం
విజయవాడ (ఆంధ్రప్రభ): పదవీ విరమణ సందర్భంగా ఐ అండ్ పీఆర్ శాఖకు చెందిన వేమూరి ప్రసాద్, వెంకటలక్ష్మి దంపతులు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని శ్రీ కనకదుర్గమ్మవారి నిత్య అన్నదాన పథకానికి రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు.
తాడేపల్లి వాస్తవ్యులైన వేమూరి ప్రసాద్, వెంకటలక్ష్మి దంపతులు తమ మనవరాలు సాయి సింధూర పేరుపై ఈ విరాళాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు. ఆలయ అధికారులు, అర్చక స్వాముల సమక్షంలో భక్తిశ్రద్ధలతో విరాళం చెక్కును అందజేశారు.
విరాళాన్ని స్వీకరించిన ఆలయ అధికారులు దాతలను అభినందించి, అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధాన ఆలయ సూపరింటెండెంట్ సత్యనారాయణ దంపతులకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, విరాళ రసీదులను అందజేశారు.
