హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ పరుగుల వరద సృష్టిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు.. పవర్ ప్లేలో తమ పవర్ హిట్టింగ్ తో అద్భుతంగా రాణించింది. ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య (13 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 36) దంచికొట్టాగా.. ఆ తరువాత ప్రభమన్ సింగ్ (20 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సుతో 40) వీరుచుకుపడ్డాడు. దీంతో 6 ఓవర్లకు పంజాబ్ స్కోర్ వికెట్ నష్టానికి 89 గా నమోదైంది.
ప్రస్తుతం క్రీజులో ప్రభమన్ సింగ్ (40) కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (9) ఉన్నారు.
IPL 2025లో అత్యధిక పవర్‌ప్లే స్కోర్‌లు:
ఎస్‌ఆర్‌హెచ్ 94/1 vs ఆర్ఆర్ – హైదరాబాద్
కేకేఆర్ 90/1 vs ఎల్‌ఎస్‌జి – కోల్‌కతా
పంజాబ్ 89/1 vs ఎస్‌ఆర్‌హెచ్ – హైదరాబాద్, ఈరోజు
ఆర్సీబీ 80/0 vs కేకేఆర్ – కోల్‌కతా
ఆర్ఆర్ 79/1 vs సీఎస్కే – గౌహతి