tvkparty | విజయ్‌ను కలిసిన నటి త్రిష
tvkparty | విజయ్‌ను కలిసిన నటి త్రిష
tvkparty | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో టీవీకే గణనీయమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్న వేళ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు విజయ్ నివాసానికి నటి త్రిష వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్న త్రిష, ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్లు సమాచారం. టీవీకే పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అభిమానులు, రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇదిలా ఉండగా, త్రిష ఇటీవల తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిసింది. అక్కడి ప్రసాదాన్ని విజయ్‌కు అందజేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఇవాళ త్రిష పుట్టినరోజు కావడం ఈ సంఘటనకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఎన్నికల ఫలితాల మధ్య ఈ భేటీ మరింత చర్చనీయాంశంగా మారింది.
