260 students | ఆరోగ్య పరీక్షలు, మందులు పంపిణీ

260 students | ఆరోగ్య పరీక్షలు, మందులు పంపిణీ

260 students | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని పీపుల్పహాడ్, అల్లాపురం, ఎరగండి తండా గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు చెందిన 260 మంది విద్యార్థుల(260 students)కు ఈ రోజు స్థానిక దివిస్ లాబరేటరీస్(Divis Laboratories) యాజమాన్యం ఆధ్వర్యంలో డాక్టర్ సికీలంమెట్ల జయంత్ కుమార్(Dr. Sikilammetla Jayant Kumar), డాక్టర్ శివ ల ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం దివిస్ లాబరేటరీస్ యాజమాన్యం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నిరంజన్ రెడ్డి, శ్రీరామ్, దివిస్ ప్రతినిధులు ఎస్ సాయి కృష్ణ, జి వెంకటేశ్వర్లు, గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply