2matches in IPL| పూన‌కాలు గ్యారెంటీ

2matches in IPL| పూన‌కాలు గ్యారెంటీ

2matches in IPL | ఈ రోజు రెండు మ్యాచులు
గుజరాత్ టైటాన్స్ తొలి విజయం కోసం
అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా
నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ ఫ్యాన్స్‌కి ఇవాళ పూన‌కాలే. ఈ రోజు రెండు మ్యాచులు జ‌ర‌గ‌నుండ‌టంతో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ. ఒక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ – ముంబై ఇండియన్స్ జట్లు ఢీకొంటుండ‌గా.. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ – రాజస్థాన్ రాయల్స్ పోటీ పడనున్నాయి. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ ఇప్పటికే తలో మ్యాచ్‌లో గెలవగా.. గుజరాత్ టైటాన్స్ తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది.

తొలి మ్యాచ్‌లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ – ముంబై ఇండియన్స్ జట్లు ఆడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఢిల్లీకి ఇది హోం గ్రౌండ్. ముంబై ఇండియన్స్ కూడా మంచి జోరుమీదుంది. తొలి మ్యాచ్ గండం నుంచి గ‌ట్టెక్కిన ఆ జ‌ట్టు.. రెండో మ్యాచ్‌లోనూ అదే ఊపును చూపాల‌ని చూస్తోంది.

2matches in IPL
2matches in IPL

తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌ను చిత్తు చేసిన ఎంఐ, ఢిల్లీని వాళ్ల గడ్డ మీదే మట్టి కరిపించాలని గట్టిగా ఫిక్స్ అయింది. దీంతో ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య హోరాహోరీ పోటీ త‌ప్ప‌ద‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇక రెండో మ్యాచులో గుజరాత్ టైటాన్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఇక రాత్రి 7:30 గంటలకు నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి గుజరాత్ టైటాన్స్ బోణి కొట్టాల‌ని చూస్తోంది.

చెన్నై సూపర్ కింగ్స్‌పై ఆధిపత్య విజయం సాధించిన రాజస్థాన్.. ఈ మ్యాచ్‌లోనూ విక్టరీ సాధించి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో నిలవాలని చూస్తోంది.

Leave a Reply