24 Carat Gold Rate | స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు!
- 24 Carat Gold Rate | స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు!
Gold Rate Good News | హైదరాబాద్, ఆంధ్రప్రభ : దేశంలో బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు కాస్త తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్, కోల్‌కతా(Hyderabad, Kolkata), ముంబై నగరాల్లో 24 క్యారెట్ పది గ్రాముల బంగారం ధర రూ.1,30,200గా ఉంది.
24 Carat Gold Rate | ప్రస్తుతం 4,215 డాలర్లు
ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం ధర రూ.1,30,350గా, 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.1,19,500గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్(24 carat), 22 క్యారెట్ గోల్డ్ ధరలు వరుసగా రూ.1,31,135, రూ.1,20,400గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ప్రస్తుతం 4,215 డాలర్లు (రూ.3,78,707.21) ధర పలుకుతుంది.

ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 280 రూపాయలు తగ్గడం కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. హైదరాబాద్‌లో ఈ రోజు బంగారం ధర 24 క్యారెట్ల బంగారం(24 carat gold) గ్రాముకు రూ. 13,020, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.11,935 ధర పలుకుతుంది. నిన్న బంగారం ధర 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 13,048, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.11,960 ధర పలుకుతుంది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు ప్రపంచ బంగారం ధరలపై ఆధారపడి ఉంటాయి. ఇవి ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లు తదితర అనేక అంతర్జాతీయ అంశాలచే ప్రభావితమవుతాయి.
24 Carat Gold Rate |పది రోజులుగా బంగారం ధరలు
రోజు 24 క్యారేట్ 22 క్యారేట్
డిసెంబర్ 02, 2025 రూ.13,020 (-28) రూ.11,935 (-25)
డిసెంబర్ 01, 2025 రూ.13,048 (+66) రూ.11,960 (+60)
నవంబర్ 30, 2025 రూ.12,982 (0) రూ.11,900 (0)
నవంబర్ 29, 2025 రూ.12,982 (+136) రూ.11,900 (+125)
నవంబర్ 28, 2025 రూ.12,846 (+71) రూ.11,775 (+65)
నవంబర్ 27, 2025 రూ.12,775 (-16) రూ.11,710 (-15)
నవంబర్ 26, 2025 రూ.12,791 (+87) రూ.11,725 (+80)
నవంబర్ 25, 2025 రూ.12,704 (+191) రూ.11,645 (+175)
నవంబర్ 24, 2025 రూ.12,513 (-71) రూ.11,470 (-65)
నవంబర్ 23, 2025 రూ.12,584 (0) రూ.11,535 (0)
Click Here To Read కొండదిగని కూరగాయలు..

