2026Season | పంజాబ్ కింగ్స్‌తో పోరు!

2026Season | పంజాబ్ కింగ్స్‌తో పోరు!

2026Season | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు (ఆదివారం) రాత్రి 7:30 గంటలకు నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆసక్తికర పోరు జరగనుంది. పంజాబ్ కింగ్స్ (PBKS), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పంజాబ్ పటిష్టంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్స్‌లో పంజాబ్ బెర్తు దాదాపు ఖరారైనట్లే.

మరోవైపు, గుజరాత్ టైటాన్స్ జట్టు వరుస విజయాలతో మళ్లీ ఫామ్‌లోకి వస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ (RCB), సీఎస్‌కే (CSK) జట్లపై గెలిచిన ఉత్సాహంతో ఉంది. ప్రస్తుతం 9 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉన్న గుజరాత్, నేటి మ్యాచ్‌లో గెలిచి టాప్-4లో చోటు దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. గతంలో ఈ రెండు జట్లు తలపడినప్పుడు పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. మరి నేడు సొంత మైదానంలో గుజరాత్ ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి!

CLICK HERE TO READ MORE : iplcricket | స‌న్‌రైజ‌ర్స్‌ స్కోర్ 44/1

CLICK HERE TO READ MORE :

Leave a Reply