Tributes | అటు రాజ్యాంగం, ఇటు ప‌ర్యావ‌ర‌ణం ప‌రిర‌క్ష‌ణే అంబేద్క‌ర్‌కు నిజ‌మైన నివాళి – మాజీ ఎంపి సంతోష్ కుమార్

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ధ్యేయంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ మాజీ రాజ‌స‌భ స‌భ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు జె.సంతోష్ కుమార్ త‌న ఎక్స్ వేదిక‌గా మొక్క‌లు నాట‌డం, వాటిని పెంచ‌డం, అలాగే ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ త‌దిత‌ర అంశాల‌పై నిత్యం చైత‌న్య ప‌రుస్తుంటారు. అదే విధంగా భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బి.ఆర్‌.అంబేద్క‌ర్ జ‌యంత్యుత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప‌ర్యావ‌ర‌ణంపై అవ‌గాహ‌న క‌ల్పిస్తూ ఓ చిత్రాన్ని విడుద‌ల చేశారు. అంబేద్క‌ర్‌కు నివాళులు అర్పిస్తూ.. ఆయన దార్శనికత ఆధునిక భారతదేశానికి పునాది వేసింద‌ని అన్నారు. అందరికీ పచ్చని, సమ్మిళిత భవిష్యత్తును పెంపొందించడం ద్వారా ఆయన వారసత్వాన్ని నిలబెట్టుకుందామ‌ని పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటాల‌ని, పెంచాల‌ని పిలుపునిచ్చారు.

https://twitter.com/SantoshKumarBRS/status/1911645617064997066

Leave a Reply