₹2000 crore | ఉద్యోగులకు రూ.2వేల కోట్ల బోనస్

₹2000 crore | ఉద్యోగులకు రూ.2వేల కోట్ల బోనస్
₹2000 crore | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అమెరికాలోని లూసియానా (Louisiana) రాష్ట్రానికి చెందిన ఫైబర్‌బాండ్ కంపెనీ సీఈవో గ్రాహమ్ వాకర్ (Graham Walker) ఉదారతకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. కంపెనీని భారీ మొత్తానికి అమ్మేసిన తర్వాత వచ్చిన ఆదాయంలో భాగంగా సుమారు రూ.2 వేల కోట్ల బోనస్ (₹2,000 crore Bonus) ను 540 మంది ఉద్యోగులకు పంచి పెట్టిన ఆయన చర్య ఉద్యోగుల శ్రమకు కృతజ్ఞతగా నిలుస్తోంది.
కష్టకాలంలోనూ సంస్థకు అండగా నిలిచిన ఉద్యోగులను (employees) గుర్తించి, వారి జీవితాల్లో భారీ మార్పు తీసుకొచ్చిన ఈ ఉదారత కార్పొరేట్ ప్రపంచంలో అరుదైన ఉదాహరణగా మారింది. ఈ నిర్ణయం ఉద్యోగుల లాయల్టీకి గౌరవం చూపడంతో పాటు, వ్యాపార నీతిని కూడా ప్రతిబింబిస్తోంది.
