పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి ప్రధాని మోడీ ఏటా ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 8వ ఎడిషన్ పరీక్షా పే చర్చ వీడియోను సోమవారం ప్రధాని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఢిల్లీలోని సుందరవనంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ప్రధాని విద్యార్థులతో మాట్లాడుతూ..ప్రశాంతంగా ఉండి పరీక్షలకు సిద్దం కావాలన్నారు. ఒత్తిడి లేకుండా చదివితేనే పరీక్షల్లో బాగా రాణించవచ్చన్నారు. విద్యార్థులు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని సూచించారు. పరీక్షల సమయంలో ఆరోగ్యకర ఆహారం అవసరమని, అనారోగ్యకర ఆహారాలు మిమ్మల్ని నీరసం చేస్తాయన్నారు. దినచర్య, అధ్యయన సమయం రూపొందించుకోవాలన్నారు. విద్యార్థులు విశ్రాంతికి తగిన సమయం కేటాయించాలన్నారు. చిరుధాన్యాల ప్రాధాన్యం గురించి ప్రధాని విద్యార్థులకు వివరించారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ప్రధాని మోడీ సూచనలు చేశారు.