workers | శిథిలాల్లో చిక్కుకున్న మ‌రికొంద‌రు

workers | శిథిలాల్లో చిక్కుకున్న మ‌రికొంద‌రు

workers | బెట్వా నదిపై నిర్మిస్తున్న వంతెన
సంఘ‌ట‌న‌పై యూపీ సీఎం దిగ్భ్రాంతి, విచార‌ణ‌కు ఆదేశం

ప్ర‌యాగ‌రాజ్, ఆంధ్ర‌ప్ర‌భ : కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న బ్రిడ్జి కేవలం గాలివానకే ఊగిపోయింది.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అర్ధరాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో కార్మికుల జీవితాలు తల్లకిందులయ్యాయి. యూపీలోని హమీర్‌పూర్ జిల్లాలో బెత్వా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి అర్ధరాత్రి హఠాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా సంభవించిన పెనుగాలుల వల్ల వంతెన కూలిపోయింది. ఇనుప సామాగ్రి, గడ్డర్లు నేలకూలడంతో కార్మికులు వాటి కింద సమాధి అయ్యారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

పేకమేడలా కూలిని బ్రిడ్జి..
ఈ దుర్ఘటనలో మరికొంతమంది బ్రిడ్జి కింద చిక్కుకున్నారని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక అధికారులు రెస్క్యూ టీమ్ లకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా ఇనుప సామాగ్రి పడటంతో వాటిని తొలగించే పనులు చేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా హమీర్ పూర్ లోని మోరకందర్ , కురార ప్రాంతాలను కలుపుతూ ఈ నూతన వంతెన నిర్మాణం జరుగుతోంది. కేవలం తుఫాను గాలుల కారణంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వంతెన నిర్మాణంలో ఉండగానే ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఐదుగురి మృతదేహాలను వెలికితీసి గుర్తించారు. శిథిలాల కింద మరో ముగ్గురు కార్మికులు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

నిద్రలోనే తెల్లారిన బతుకులు…

కోట్లతో నిర్మిస్తున్న ఈ కొత్త బ్రిడ్జి వద్ద శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బ్రిడ్జి కింద నిద్రిస్తున్న కార్మికులు శిథిలాల కింద నలిగిపోయారు. రాత్రంతా అక్కడే నిద్రపోయి ఉదయాన్నే వంతెన పనులను మొదలుపెడతారు. అయితే వర్షం, తుఫాను తీవ్రతకు బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోవడంతో ఇనుప సామాగ్రి వారిపై పడటంతో అక్కడికక్కడే మరణించారు.

ప్రమాదంపై స్పందించిన సీఎం యోగి…
హమీర్ పూర్ వంతెన కూలిన ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ వెంటనే స్పందించారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేకాదు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందేలా చూడాలని చెప్పారు. ఈ ఘటనపై వెంటనే నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

CLICK HERE TO READ 322 people | ఎవ‌రెస్ట్‌పై.. మృత్యుకుహ‌రం

CLICK HERE TO READ MORE

Leave a Reply