Womens T20 World Cup 2026 | నేటి నుంచి పొట్టిక‌ప్పు కోసం పోరు

Womens T20 World Cup 2026 | నేటి నుంచి పొట్టిక‌ప్పు కోసం పోరు

Womens T20 World Cup 2026 | ఇంగ్లండ్ వేదిక‌గా ఐసీసీ ఉమెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ షురూ
మొద‌టి మ్యాచ్‌లో శ్రీ‌లంక‌తో ఇంగ్లండ్ ఢీ
ఆదివారం భారత్-పాకిస్థాన్ హై వోల్టేజ్ పోరు..
విజేతకు రూ.22 కోట్ల భారీ ప్రైజ్ మనీ

Womens T20 World Cup 2026 | ఆంధ్రప్రభ, స్పోర్ట్స్: మహిళా క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌కు శుక్రవారం తెరలేవనుంది. ఇంగ్లండ్ వేదికగా ప్రారంభమవుతున్న ఈ మెగా టోర్నీలో ప్రపంచంలోని అగ్రశ్రేణి 12 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. మహిళా క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ మధ్య జరుగుతున్న ఈ టోర్నీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టోర్నీలో పాల్గొనే 12 జట్లను చెరో 6 జట్లతో రెండు గ్రూపులుగా విభజించారు. లీగ్ దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగిలిన ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత రెండు గ్రూపుల నుంచి టాప్-2 లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇంగ్లాండ్‌లోని 7 వేర్వేరు అంతర్జాతీయ మైదానాల్లో మొత్తం 33 ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తంగా చూస్తే.. క్రికెట్ అభిమానులకు రాబోయే మూడు వారాలు పూర్తి వినోదాన్ని పంచేందుకు మహిళల పొట్టి ప్రపంచకప్ సిద్ధమైంది. టైటిల్ వేటలో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి.

ఇంగ్లాండ్‌ వేదికగా శుక్రవారం ఐసీసీ ఉమెన్స్ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ పొట్టి కప్పు ప్రారంభం కానుంది. పన్నెండు జట్లు తలపడుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో తొలి రోజు ఆతిథ్య ఇంగ్లాండ్‌ను శ్రీలంక ఢీకొనబోతోంది. నాట్‌సీవర్‌ బ్రంట్‌ సారథ్యంలో ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతున్న ఇంగ్లిష్‌ జట్టును దాని సొంతగడ్డపై నిలువరించడం.. చమరి ఆటపట్టు నేతృత్వంలోని శ్రీలంకకు సవాలే. భారత్‌ ఆదివారం తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొంటుంది.

కొత్త ఫార్మాట్‌తో మరింత రసవత్తరం
ఈసారి టోర్నీలో మొత్తం 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో ఆరు జట్లు ఉంటాయి. లీగ్ దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగతా ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అనంతరం రెండు గ్రూపుల నుంచి టాప్-2 స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇంగ్లండ్‌లోని ఏడు అంతర్జాతీయ వేదికల్లో మొత్తం 33 మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత్, పాకిస్తాన్ లీగ్ ఫైట్
కప్పు గెలవడం కంటే ముందు హర్మన్‌ప్రీత్‌ సేన సహా ప్రతి జట్టు లక్ష్యం సెమీస్‌ చేరడం. భారత్‌ కొంచెం కఠినమైన గ్రూప్‌లోనే ఉంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటం అభిమానులకు అసలైన క్రికెట్ కిక్‌ను ఇవ్వనుంది. గ్రూప్-1 లో భారత్, పాకిస్తాన్‌లతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల్లో ఒక జట్టును వెనక్కి నెట్టి సెమీస్‌ చేరడం అంత తేలిక కాదు. ఇదే గ్రూప్‌లో ఉన్న పాకిస్థాన్‌ను భారత్‌ ఓడించగలదు. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌లపై నెగ్గడమూ కష్టం కాదు. కానీ ఆసీస్, సఫారీ జట్లలో ఒకదాన్ని ఓడిస్తేనే భారత్‌ ముందంజ వేయడానికి అవకాశముంటుంది. ఈ రెండు జట్లపై నిరుడు వన్డే ప్రపంచకప్‌ సెమీస్, ఫైనల్స్‌లో నెగ్గడం భారత్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే.ఇక గ్రూప్-2 లో ఆతిథ్య ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్ జట్లు తలపడనున్నాయి. భారత్‌ ఆదివారం తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొంటుంది.

విజేతకు రూ.22 కోట్ల భారీ బహుమతి
ఈసారి ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక ప్రైజ్ మనీని ఐసీసీ ప్రకటించింది. టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు 2.34 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో సుమారు రూ.22 కోట్లకు పైగా నగదు బహుమతి అందనుంది. రన్నరప్ జట్టుకు 1.17 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.11 కోట్ల బహుమతి లభించనుంది.

CLICK HERE TO READ భారీ లక్ష్యాన్ని ఛేదించి భీమవరం బుల్స్

CLICK HERE TO READ MORE

Leave a Reply