Fire Safety | ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి అవసరం

Fire Safety | ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి అవసరం

Fire Safety | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : అమీర్‌పేట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తక్షణ పరిహారం అందించాలని టీఆర్ఎస్ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అమీర్‌పేట్ ఫైర్ యాక్సిడెంట్ బాధితులను క‌విత క‌లిశారు. ఈసంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ…. బాధిత కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఫైర్ సిబ్బంది ఆలస్యంగా రావడంపై ప్రశ్నలు

అగ్నిప్రమాదం జరిగిన తర్వాత దాదాపు గంటన్నర ఆలస్యంగా అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారని కవిత ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదాలను ఎలా నియంత్రించగలమని ప్రశ్నించారు. అత్యవసర సేవల స్పందన సమయంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.

సీఎం రేవంత్ ప్రత్యేక సమీక్ష నిర్వహించాలి

ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. అగ్నిమాపక శాఖ సన్నద్ధత, నగరంలో భవనాల భద్రతా ప్రమాణాలు, అత్యవసర స్పందన వ్యవస్థలపై సమగ్ర పరిశీలన చేపట్టాలని కోరారు. ప్రజల ప్రాణ, ఆస్తి భద్రత విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

Leave a Reply