నిత్యం, నైమిత్తికం, కామ్యం అని పూజలు మూడు విధాలుగా ఉంటాయి. ప్రతి నిత్యం చేసే పూజ నిత్య పూజ విశేష దినాలైన అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి మొదలగు పర్వదినాలలో చేసే పూజను నైమిత్తికం అంటారు. వివాహం, సంతానం, గృ#హం, ధనం, ధాన్యం మొదలగు కోరికలు తీరడానికి చేసే పూజ కామ్య పూజ.
నిత్య పూజకు, నిత్య ఆరాధనకు సంకల్పంతో పనిలేదు. ధూపదీప నైవేద్యాదులతో స్వామిని ఆరాధిస్తే చాలు. నైమిత్తిక, కామ్య ఆరాధనకు మాత్రం ఆ నిమిత్తాన్ని కోరికను తెలపడానికి సంకల్పం చెప్పాలి. సంకల్పం సంస్కృతంలో ఉంటుంది కావున భాష రాని వారు తెలియని వారు చక్కగా పలకలేని వారు భాష వచ్చిన పెద్దలతో సంకల్పం చెప్పించుకొని ఆయా పూజాధికములు చేయాలి. తాము చేయలేని పూజలను పెద్దలతో చేయించాలి. ‘రక్ష’కు బదులు ‘భక్షత’ లేదా ‘శిక్షతు’ అని పలికితే అనర్ధాలు జరుగుతాయి. ‘సకల కామ్యార్ధ సిద్ధ్యర్ధం అనడానికి బదులు ‘సకలా కామ్యార్థ సిద్ధ్యర్ధం’ అని పలికితే ‘అకామ్యార్ధ’ అని అనగా కోరని వాటిని ప్రసాదించమని అర్ధం. ఇటువంటి అనర్ధాలు జరగకూడదని పలకలేని వారు సంకల్పం చెప్పకూడదని శాస్త్రవచనం.
పూజాధికంలో సంకల్పం ప్రాముఖ్యం ఏమిటి?
