West Bengal | భారీగా నగదు, మద్యం పట్టివేత

West Bengal | భారీగా నగదు, మద్యం పట్టివేత

West Bengal | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్రమ కార్యకలాపాలపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు చేపట్టింది. భారీగా నగదు, మద్యం పట్టివేతలు జరగడం విశేషం. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ నగదు, మద్యం పంపిణీకి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపట్టింది.

ఫిబ్రవరి 26న ఎన్నికల నిఘా వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చినప్పటి నుంచి మార్చి 25 వరకు అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రికార్డు స్థాయిలో రూ.408.82 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఇక మార్చి 15 నుంచి 25 మధ్య కేవలం పది రోజుల వ్యవధిలోనే ‘సి–విజిల్‌’ యాప్ ద్వారా 70,944 ఫిర్యాదులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు పేర్కొన్నారు.