Wave surge | కృత్తివెన్ను తీరంలో అలల ఉద్ధృతి

  • మత్స్యకారులకు హెచ్చరిక

Wave surge | కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : దిత్వా తుఫాన్ ప్రభావంతో కృత్తివెన్ను సముద్రతీరంలో (On the beach) అలల ఉద్ధృతి ఆదివారం ఉదయం తీవ్రమైంది. నిమిషానికో రూపం మారుస్తూ అలలు తీరానికి మరింత చేరువవుతున్నాయి. తుఫాన్ తీరం దాటే వరకు పరిస్థితులు మరింత మారే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు (Fishermen) సముద్ర యాత్రలకు దూరంగా ఉండాలని మైరైన్ శాఖ స్పష్టమైన హెచ్చరికలు (Warnings) జారీ చేసింది. అవనిగడ్డ మండల పరిధిలోని కోడూరు మండలం వద్ద ఉన్న హంసలదీవి బీచ్ గేట్లు రెండు రోజులపాటు మూసివేశారు. మత్స్యకారులు పర్యాటకులు వెళ్లకుండా ఫారెస్ట్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని స్వల్పంగా వర్షం కురుస్తుంది.

Leave a Reply