“రా వాటర్ పంపింగ్” పనులను ప‌ర్య‌వేక్ష‌ణ‌..

“రా వాటర్ పంపింగ్” పనులను ప‌ర్య‌వేక్ష‌ణ‌..

సత్తెనపల్లి, ఆంధ్రప్రభ : సత్తెనపల్లి పురపాలక సంఘం పరిధిలో కొనసాగుతున్న మేజర్, మీడియం డైన్ల పూడికతీత పనులతో పాటు గార్లపాడు రోడ్డులో వున్న పురపాలకసంఘ రక్షిత మంచినీటి సరఫరా చెరువుకు, ఆయిల్ ఇంజన్ల ద్వారా చేపడుతున్న రా వాటర్ పంపింగ్ పనులను గురువారం సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి, ప్రత్యేక అధికారి కె. శ్రీరాములు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైన్లలో పూడిక తొలగింపు పనుల పురోగతిని, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న ముందస్తు చర్యలను ఆయన సమీక్షించారు.

అలాగే పట్టణ ప్రజలకు నిరంతరాయంగా తాగునీటి సరఫరా అందించేందుకు రక్షిత మంచినీటి చెరువుకు నిర్వహిస్తున్న రా వాటర్ పంపింగ్ ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ ఎన్. ఆనందకుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. మధుసూధనరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ పార్థసారథి, అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుదల, తాగునీటి సరఫరా సక్రమంగా కొనసాగేందుకు పురపాలక సంఘం అవసరమైన చర్యలు చేపడుతోందని కమీషనర్ నంబూరి ఆనంద్ కుమార్ తెలిపారు.

Leave a Reply