41milliondollars | అమెరికా జంట‌కు.. జాక్‌పాట్ !

41milliondollars | అమెరికా జంట‌కు.. జాక్‌పాట్ !

41milliondollars | లాట‌రీలో ఏకంగా రూ.386 కోట్లు బ‌హుమ‌తి
ముపై ఏళ్ల‌కు ఫ‌లించిన నిరీక్ష‌ణ‌
ఓపికకు దక్కిన గౌరమ‌న్న‌ దంప‌తులు

41milliondollars | న్యూ యార్క్, ఆంధ్ర‌ప్ర‌భ : అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు విజయం వరిస్తుందని అమెరికాలోని ఓ దంపతులు నిరూపించారు. సుమారు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఈ దంపతులకు లాటరీలో భారీ మొత్తంలో నగదు బహుమతి లభించింది. 30 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం అమెరికా టెక్సాస్‌ రాష్ట్రంలోని రిచర్డ్‌సన్‌కు చెందిన ఓ దంపతులు గత 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా లాటరీలో పాల్గొంటున్నారు. ప్రతిసారీ నిరాశే ఎదురవుతున్నా, అదృష్టం ఏదో ఒక రోజు తమ తలుపు తట్టకపోతుందా అన్న ఆశతో టికెట్లు కొనుగోలు చేస్తూనే వచ్చారు.

వీరి నిరీక్షణకు తాజాగా ఫలితం దక్కింది . ఇటీవల తీసిన లక్కీ డ్రాలో ఈ దంపతులకు ఏకంగా 41 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 386 కోట్లు) లాటరీ తగిలింది. ఒక్కసారిగా ఇంత భారీ మొత్తం సొంతం కావడంతో ఆ దంపతులు ఆనందంలో మునిగిపోయారు. “మేము ఎప్పుడూ నమ్మకాన్ని వదులుకోలేదు, మా ఓపికకు దక్కిన గౌరవం ఇది” అని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “నిరీక్షణకు తగ్గ ఫలితం లభించింది” అంటూ నెటిజన్లు ఆ దంపతులకు అభినందనలు తెలుపుతున్నారు.

CLICK HERE TO READ సీజ్‌ఫైర్‌కు.. తూట్లు

CLICK HERE TO READ MORE