నిజాంపేటలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు..

నిజాంపేట, ఆంధ్రప్రభ ; మండల కేంద్రంలో తెల్లారుజామునే బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. ఉదయం లేచి మద్యం ప్రియులు మద్యం తాగడానికి బెల్ట్ షాపులను ఆశ్రయిస్తున్నారు. బెల్ట్ షాప్ నిర్వాహకులు మద్యం బాబులను ప్రోత్సహించడం జరుగుతుంది. గ్రామంలో మద్యం మత్తులో తరచుగా గొడవలు దిగడం రోడ్లపై వాహనాలు వెళ్లే వారిపై ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇంత జరుగుతున్న మాత్రం అధికారులు పట్టించుకున్న పాపనా పోలేదని ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి బెల్ట్ షాపులను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a Reply