NimraCafeandBakery | నిమ్రా కేఫ్‌లో ఇరానీ చాయ్‌ ఆస్వాదించిన రామన్న

NimraCafeandBakery | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: హైదరాబాద్‌ పాతబస్తీలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ సందడి చేశారు. చార్మినార్‌ సమీపంలోని ప్రసిద్ధ నిమ్రా కేఫ్‌ అండ్‌ బేకరీని ఆయన సందర్శించారు. పాతబస్తీ సంస్కృతికి అద్దం పట్టే ఇరానీ చాయ్‌, బిస్కెట్లకు పేరొందిన ఈ కేఫ్‌లో కేటీఆర్‌ కొంతసేపు గడిపారు.

చార్మినార్‌కు ఆనుకుని ఉన్న నిమ్రా కేఫ్‌ హైదరాబాద్‌లో ప్రసిద్ధ ఇరానీ చాయ్‌, ఉస్మానియా బిస్కెట్లకు పేరుగాంచింది. ఈ కేఫ్‌ వద్దకు వచ్చిన కేటీఆర్‌ను చూసేందుకు స్థానికులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఆసక్తి చూపారు. కేటీఆర్‌ అక్కడి వారితో ముచ్చటించినట్లు సోషల్‌ మీడియాలో పలు పోస్టులు వైరల్‌గా మారాయి. పాతబస్తీ పర్యటనలో భాగంగా కేటీఆర్‌ నిమ్రా కేఫ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది.

నిమ్రా కేఫ్‌ అండ్‌ బేకరీ చార్మినార్‌ సమీపంలో ఉండటం వల్ల దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా తరచూ ఇక్కడికి వస్తుంటారు. గతంలో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టీ కూడా చార్మినార్‌ పర్యటనలో భాగంగా నిమ్రా కేఫ్‌ను సందర్శించి, అక్కడి ఇరానీ చాయ్‌ను ఆస్వాదించారు.

https://twitter.com/BTR_KTR/status/2062435923166703885/video/1

Leave a Reply