నారా లోకేష్‌కు ఘన స్వాగతం

నారా లోకేష్‌కు ఘన స్వాగతం
శ్రీ సత్యసాయి ఎయిర్‌పోర్ట్‌లో ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు
శ్రీ సత్యసాయి, ఆంధ్రప్రభ : గురువారం మధ్యాహ్నం శ్రీ సత్యసాయి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌తో పాటు ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన వ్యవహారాల శాఖల మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు & స్టాంపులు శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్, వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు.
మంత్రివర్గ సభ్యులకు ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, కందికుంట వెంకటప్రసాద్, ఎమ్మెస్ రాజు, దగ్గుపాటి వెంకటప్రసాద్, బండారు శ్రావణి, సురేంద్రబాబు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పుట్టపర్తి ఆర్డీవో సువర్ణ, తహసీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు.
