తొర్రూరు కొత్త ఎస్సై బాధ్యతల స్వీకరణ

తొర్రూరు కొత్త ఎస్సై బాధ్యతల స్వీకరణ
తొర్రూరు, ఆంధ్రప్రభ: తొర్రూరు పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్సైగా తోట మహేంద్ర రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకాన్ని మహబూబాబాద్ ఎస్పీ శబరిష్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం విధించారు.
మహేంద్ర రెడ్డి మునుపు చెన్నారావుపేట, సుబేదారి స్టేషన్లలో ఎస్సైగా పనిచేశారు. బదిలీలలో భాగంగా ఆయన తొర్రూరు పోలీస్ స్టేషన్‌కు చేరారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న గొల్లమూడి ఉపేంద్రను మహబూబాబాద్ ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
నూతన ఎస్సై మాట్లాడుతూ, “మండలంలో శాంతి భద్రతను కాపాడేందుకు కృషి చేస్తాను. అసాంఘిక కార్యకలాపాలు, జూదం, మాదక ద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాను” అని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది మహేంద్ర రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.
