లయన్స్ క్లబ్ అఫ్ కేసముద్రం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
లయన్స్ క్లబ్ అఫ్ కేసముద్రం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలం కోరుకొండ పల్లి గ్రామంలో ఉచిత మధుమేహ , రక్త పోటు నిర్ధారణ పరీక్షలు చేయడమైనది . ఈ కార్యక్రమంలో సుమారు వందమంది ఈ పరీక్షలు సద్వినియోగం చేసుకునారనీ నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా కేసముద్రం మండలం లోగల ప్రాథమిక వైద్యశాలలో ఉన్న వైద్యులని డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ శివరాం, డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ స్పందన డాక్టర్ సుభాషిని డాక్టర్ కె చంద్రశేఖర్ లను సన్మానించుకోవడం జరిగింది. సిఎ చాటర్ అకౌంటెంట్ డే సందర్భంగా సిఏ రమ్యని సన్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా కేసముద్రం మండలంలోనీ కేసముద్రం విలేజ్ గ్రామ పరిధిలో ఉన్న లయన్స్ భవన్ ఆవరణంలో హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ప్రెసిడెంట్ ఎర్నం శ్రీరాములు, సెక్రటరీ తాళ్లపల్లి రాజు, ట్రెజరర్ మడిపెద్ది వెంకటేష్, చాటర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే చంద్రశేఖర్, రాపోలు శ్రీనివాస్ , చామకూరి నరసయ్య , ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,బెజ్జం ప్రేమ్ కుమార్, చింత కరుణాకర్ , రాపాక కుమారస్వామి, చింతనూరి సతీష్, దాసరి అశోక్ , ప్రాథమిక హాస్పిటల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
