Walking Track | మొక్కలు నాటండి..

Walking Track | మొక్కలు నాటండి..

  • వాతావరణ సమతుల్యాన్ని కాపాడండి..
  • టీడీపీ నాయ‌కులు

Walking Track | పాయకాపురం, ఆంధ్రప్రభ : వాతావరణ సమతుల్యానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని స్థానిక 61వ డివిజన్(61st Division) క్లస్టర్ ఇన్‌చార్జి దాసరి కనకారావు, అధ్యక్షుడు ఆకుల సూర్యప్రకాష్ అన్నారు. ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు డివిజన్ ప్రాంతంలో చెరువు పార్కులో పాదాచారులకి మొక్కలు పంపిణీ కార్యక్రమం మంగళవారం ఉదయం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఆకుల సూర్య ప్రకాష్, 60, 61వ డివిజన్ల క్లస్టర్ ఇంచార్జి దాసరి కనకారావులు పాల్గొని పలువురికి ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు ఆకుల సూర్యప్రకాష్ మాట్లాడుతూ… టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా హయాంలో డివిజన్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతినెలా ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ పింఛన్లు, పాదాచార్యులు ఆహ్లాదకరమైన వాతావరణానికి వాకింగ్ ట్రాక్(Walking Track) నిర్మించడం, ఆహ్లాదకరమైన వాతారణానికి పార్కులు, ఉద్యానవనాలు నిర్మించడం, రోడ్లు నిర్మించడం ఇలా అన్నివిధాలా డివిజన్ అభివృద్ధి చెందుతున్నదని అన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జి దాసరి దుర్గారావు, డివిజన్ ఉపాధ్యక్షుడు అన్నా బత్తుల శీను, బూత్ కన్వీనర్ దుర్గ ప్రసాద్, భవాని, శివకుమారి, సాంబశివరావు, దొడ్డి చింతల ఫణికుమార్, నాగేశ్వరరావు, కోటేశ్వరి, చిన్నరావు, అంజి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply