గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే తీజ్ పండుగ వేడుకలను నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం రూప్ల తాండ గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సర్దార్, సంతోష్, సీతారాం, రాజేష్, గంగాధర్, భాస్కర్ నాయక్‌ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తీజ్ పండుగ ప్రాధాన్యతను వివరించారు. గిరిజనుల ఆచారాలు, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పండుగను ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.

పండుగ వేడుకల్లో యువత, మహిళలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తీజ్ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తీజ్ పండుగ ద్వారా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇలాంటి పండుగలు గ్రామ ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు, చిన్నారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.