వైసీపీ నేత రక్తదానం..

దర్శి, ఆగస్టు 14 (ఆంధ్రప్రభ) : దర్శి పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు భవనం కొండారెడ్డి మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న పేషెంట్ కు రక్తదానం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే కురిచేడుకు చెందిన టీచర్ అన్వర్ బాషా భార్య సయద్ సాఫియా కిడ్నీలు సంబంధిత వ్యాధితో బాధపడుతూ మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అర్జెంటుగా ఏ నెగిటివ్ బ్లడ్ కావాలని దర్శి మానవతా సంస్థ చైర్మన్ వెంకటరెడ్డిని సంప్రదించారు.

ఆయన మానవత గ్రూపులో సమాచారం ఇవ్వగా.. స్పందించిన భవనం కొండారెడ్డి వెంటనే గురువారం సాయంత్రం మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి బాధితురాలికి రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మానవతా చైర్మన్ డి వెంకటరెడ్డి, మానవతా సభ్యులు, బాధితురాలు కుటుంబ సభ్యులు కొండారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.