వైద్య విద్యకు నైపుణ్యమే గీటురాయి!
వైద్య కళాశాలల్లో పెరుగుతున్న సీట్లు.. నాణ్యతపై ప్రశ్నలు
ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఫీజుల భారం
వైద్య విద్యలో నాణ్యతే కీలకం
పేద విద్యార్థులకు ప్రభుత్వ సహకారం అవసరం
ప్రతిభకు ప్రాధాన్యం.. సమర్థులైన వైద్యులే లక్ష్యం
ప్రైవేటు కళాశాలల నిర్వహణపై ఆందోళనలు
ప్రజలకు ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వాల లక్ష్యం
వైద్య విద్యను అభ్యసించటానికి వైద్య కళాశాలలు ఎక్కువగా వుండాలని దేశంలోని ప్రజలందరూ అభిలషిం చటంలో తప్పులేదు కానీ, ఎక్కువగా మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లాలోనూ, వీలైతే ప్రతి మండల స్థాయిలోనూ స్థాపించిన, స్థాపిస్తున్న ప్రభుత్వాలు ఆ ఉన్నత విద్యకు సంబంధించిన సౌకర్యాలు ఆనుపానులతో పాటు తగ్గ స్థాయిలో ప్రొఫెసర్లే కాదు ప్రతిభ కలిగిన విద్యార్థులను చేర్చుకుంటున్నారా లేదా అనే సందేహం దేశవ్యాప్తంగా నిపుణులు చర్చిస్తున్న మాటను, వారి ఆందోళనా పూర్వక ఆలోచనలనూ ఎవరూ కాదనలేరు! గడిచిన 12 సంవత్స రాలలో రెండింతలు కాలేజీలలో సీట్లు ప్రభుత్వ చొరవతో పెరిగిన మాట వాస్తవం! ప్రభుత్వం మెడికల్ విద్యపట్ల చూపిస్తున్న శ్రద్ధకు కారణం ఆరోగ్యపరంగా అన్ని సౌకర్యాలు ప్రజలకు అందజేయాలన్న తాపత్రయమే! అయితే అందుకు తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సమకూరుస్తున్నారా లేదా అన్నదే మధ్య కాలంలో ప్రశ్నార్థకంగా మారుతున్నది! వైద్య విద్యను ప్రైవేటు పరం చేయటం ఎంతవరకు సమం జసం అన్న అంశం వేరే చర్చలకు దారితీస్తుంది. ప్రయివేటు సంస్థలకు కళాశాలల నిర్వహణ అప్పజెప్పటం వల్ల, ఏదో సామెత చెప్పినట్లు, మంది ఎక్కువయితే మజ్జిగ పల్చనవు తుందన్న మాదిరిగా కాలేజీ లల్లో చదివిన విద్యార్థుల ప్రతిభాపాటవాలు అంతంత మాత్రంగానే వుంటున్నాయి! ఇంజనీర్లకు సాంకేతిక విజ్ఞానం తగినంత లేకపోతే కట్టిన కట్టడాలూ, బ్రిడ్జీలు ఖాయంగా కూలిపోతాయని సామా న్యులు భయపడటంలో, ఆశ్చర్యపడాల్సిన అంశం ఏమీ లేదు! అలాంటి సూత్రమే వైద్య విజ్ఞానానికి గూడా వర్తిస్తుంది!
ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రయివేటు సంస్థలు సంఖ్యలో సగం కంటే ఎక్కువగా ఎం.బి.బి.యస్ సీట్లు పొందుతున్నాయి! 10,000 సీట్లు కొత్తగా సాంక్షన్ అయిన సీట్లలో 79శాతం దాదాపు అలాంటి సంస్థలకే చెం దాయి! అంటే విద్య అభివృద్ధి రాబోయే కాలంలో వారి మీదనే ఆధారపడివుంది, అని అనుకోక తప్పదు! సీట్లు పెర గటం మంచిది అని అనుకోవటంలో ముఖ్యమైన కారణం, మెడికల్ కాలేజీలలో ప్రవేశం పొందటానికి విద్యార్థులు విపరీతంగా పోటీపడటం వలన ప్రతిభకు పట్టం కట్టే అవకాశం సీట్లపెంపుతో దొరికినట్లవుతుంది! స్పెషలైజ్డ్ ప్రాక్టీషనర్స్, ప్రొఫెసర్ కొరత అధిగమించాల్సిన ఆవశ్యకత జిల్లాలోని వైద్య కళాశాలలకు వుంది! చాలామంది విదేశాలలో పై విద్యకు ఎగబడతారు కూడా! అందువల్ల సీట్లు పెరగటం వల్ల ఎక్కువ మంది విద్యనభ్యసించి బయటకు వస్తారు! కొందరు మన దేశంలోనే వుండి కొరతను పూరించే అవకాశం కొంతలో కొంత దొరుకుతుంది! ఆ విధంగా మంచిజరిగే అవకాశాలే సీట్లపెంపు వల్ల వుంటాయి! అయితే ఆ మంచికి కొన్ని పరిమితులున్నాయన్న సంగతి దేశ ప్రభుత్వాల అవగాహనలో వుండాలి! సీట్లు పెరిగాయి బాగానే వుంది! ఫీజుల విషయం మనం ఆలోచించాల్సిన అవసరం వుంది కదా! ఫుల్ టర్మ్ ఫీజ్ గవర్నమెంటు మెడి కల్ కాలేజీలలో 5లక్షలకు మించకపోవచ్చు! అదే ప్రయి వేటు కళాశాలల్లో 10 రెట్లు ఎక్కువ వసూలు చేసేవిషయం గూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజారోగ్యం దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొంత పెరిగినా ఫర్వాలేదు కానీ పేద విద్యార్థులు అంత ఫీజులను కట్టే అవకాశమే లేదు! కొంత మేర కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు, ఫీజు ఫుల్ రీయింబ ర్స్మెంట్ కొన్ని వర్గాల వారికి, కొంతమేర మరికొన్ని వర్గా లకు అందజేస్తున్నాయి! అయితే మధ్య ఆర్థిక మాంద్యం వల్ల ప్రభుత్వాలు కళాశాలలకు యివ్వలేకపోవటంతో మేనే జ్మంట్ వారు కోర్టులకు గూడా విషయాన్ని తీసుకెళ్ళటం జరిగింది! వృత్తి సంబంధమైన కోర్సులలో నాణ్యత ముఖ్యం! చదువు చెప్పేవారిలో, చెప్పించుకొనే వారిలో గూడా నాణ్యత లేకపోతే సమాజం ఆశించిన రీతిలో వైద్య ప్రమాణాలు వుండకపోగా వైద్యుల సామర్ధ్య లోపం వల్ల అనవసర యిబ్బందులు వైద్యం తీసుకొనే వారికి జరగ వచ్చు! పేద, బీద విద్యార్థులకు వెనకబడిన తరగతుల విద్యార్థులకు రీయింబర్స్మెంట్ సహకారం అందించ వచ్చు, కానీ మిగతావారికి ఎంతవరకు సహాయం ప్రభు త్వాలు చేయొచ్చో ఆలోచించాల్సిన సమయం ఆసన్న మయింది!
ప్రొఫెషనల్ కాలేజీ లో చదివేవారికి వారి వారి ప్రతిభ ఆధారంగా అట్టడుగు స్థాయిలో సామాజికంగా వున్నవా రికి, ప్రతిభ వల్ల సీటుకు అర్హుడు అయినవారికి కచ్చితంగా ప్రభుత్వాలు రీయింబర్స్మెంట్ స్కీంను ఆర్థిక వెసులుబా టును దృష్టిలో వుంచుకొని చేయొచ్చు ! కానీ ఉచిత వైద్య సౌకర్యం సమాజంలో కల్పించాల్సిన తరుణంలో విద్యార్థు లను మెడికల్ కళాశాలల్లో చేర్చుకోవటానికి టాలెంట్‌ను అర్హతగా భావించి ప్రధమ అవకాశం వారికి యిచ్చినప్పుడే వృత్తిపరంగా సమర్థులైన వైద్యులను సమాజానికి అందజే యిచ్చు! నాణ్యత కేవలం అగ్రవర్ణాలకే చెందుతుందని, వారే టాలెంట్‌ను పుణికిపుచ్చుకొని వున్నారని భావించటం తగదు. ఎంతోమంది బీదతనంతో వర్ణ విభేదాలతో బాధిం పబడుతున్నా మన దేశంలో వారికి వారే స్వతంత్రంగా స్వీయ ప్రతిభతో ఉన్నతంగా ఎదుగుతున్నారు.
ఆవిధంగా ప్రతిభతో ఎదుగుతున్న వారికి సరియైన సహాయం ప్రభుత్వ పరంగా యివ్వాలి! హాస్టళ్ళల్లో ఫీజు లేకుండా నివాసరవాణా సౌకర్యాలు కల్పించాలి! ప్రభుత్వా లు వారిని ప్రత్యేక దృష్టితో చూసినప్పుడే సమాజంలో అలాంటివారికి ఉచిత స్థానాన్ని కల్పించిన వారవుతారు.
ప్రైవేటు మానేజిమెంట్ వారు చాలావరకు సంస్థలు నడపటం అనేది బిజినెస్‌గానే భావిస్తారు. అలాంటివారి చేతుల్లోకి మెడికల్ కాలేజీల్లాంటివి పోగూడదు! ప్రతిభతో నిమిత్తం లేకుండా కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థినీ ప్రతిభాపరంగా సమాన స్థాయికి వృత్తిలో వచ్చే విధంగా కాలేజీలలోనే సరియైన అవగాహనతో విద్యలో నైపుణ్యవం తులుగా, అన్నిరకాల శిక్షణలు యిచ్చినప్పుడు వృత్తిలో వారు రాణించగలరు! చాలా ప్రయివేటు కళాశాలల వారు ఎన్.ఎమ్.సిఅప్రూవల్ (నేషనల్ మెడికల్ కమీషన్) పొంద టమే ధ్యేయంగా పెట్టుకుంటారు. కనీసస్థాయిలో సౌకర్యాలు కల్పించి శిక్షణపరంగా, హాస్టల్, రవాణా లాంటి అవస రమైన వాటిని పట్టించుకోకుండా, ఎక్కువ డబ్బు సంపాదన మీదనే దృష్టి పెట్టారు! ‘కాపిటేషన్ ఫీజ్’ అనేది గవర్నమెంట్ బ్యాన్ చేసినా, అటు కళాశాలలు నడిపేవారు, విద్యార్థుల తల్లిదండ్రులు కాదనలేని పరిస్థితి! నిజా నికి ఎన్.యం. సినిబంధనల ప్రకారం ప్రైవేటు కళాశాల ల్లోని సగం కళాశాలలు గవర్నమెంటు రేట్లప్రకారమే విద్యార్థుల సీట్లను భర్తీ చేయాలి! అది అమలుచేయటం ప్రస్తుత పరిస్థితులలో సాధ్యం కావటం లేదు!
ఏది ఏమైనప్పటికిని ప్రభుత్వాలు విద్యతో పాటు వైద్యం గూడా ప్రజలకు ఉచితంగా అందించిన నాడు ప్రజా ప్రభు త్వాలు పేరు తెచ్చుకుంటాయి!
· రావులపాటి సీతారాంరావు
