PM Narendra Modi | కేంద్ర పథకాలను వివరించండి

PM Narendra Modi | కేంద్ర పథకాలను వివరించండి
- గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు
- ఊట్కూర్ మండల సర్పంచ్‌లకు అభినందనలు
PM Narendra Modi | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశ పెడుతున్నవివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించి బీజేపీని మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు అన్నారు. దక్షిణ తెలంగాణలోనే ఊట్కూర్ మండలంలో 8 మంది బీజేపీ సర్పంచులు గెలుపొందడం శుభ సూచకమని స్పష్టం చేశారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో తుది విడత ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా రాంచంద్రరావు మాట్లాడుతూ దక్షిణ తెలంగాణలోనే ఊట్కూర్ మండలంలో 8 మంది సర్పంచ్‌లు గెలవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని భరోసానిచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పీఎం మోడీ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, అవి ప్రతీ గడపకు చేరేలా చూడాలన్నారు. పాలమూరు ఎంపీ డీకే అరుణ నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి పల్లె అభివృద్ధి లక్ష్యంగా నూతన పాలకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ నాయక్, వీహెచ్‌పీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాలస్వామి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కర్, నూతన సర్పంచులు ఎం రేణుక భరత్, వాకిటి వెంకటేష్, అంజయ్య, నర్సింహ, తిరుమలేష్, కాశమ్మ, కస్తూరివాణి, రేణుక, భాజపా నాయకులు కృష్ణయ్య గౌడ్, ఎం విజయ్ కుమార్, కుర్వ ఆశప్ప, లక్ష్మణ్, ఆంజనేయులు గౌడ్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
