చెన్నై -బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,కే.ఆర్.సురేష్ రెడ్డి, మాజీ మంత్రులు గుంతకండ్ల జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ సుంకర(శంభీపూర్)రాజు తదితర ప్రముఖులు మాజీ గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ తో భేటీ అయ్యారు.కేటీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నాయకులను ఆహ్వానించి”జేఏసీ ఫర్ ఫేర్ డీలిమిటేషన్”అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న తర్వాత నరసింహన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
చెన్నై అల్వార్ పేటలోని తమ నివాసానికి విచ్చేసిన కేటీఆర్, రవిచంద్ర, సురేష్ రెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వినోద్ కుమార్,రాజు తదితరులకు నరసింహన్-విమల దంపతులు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వారు నరసింహన్ దంపతులకు పుష్పగుచ్ఛాలిచ్చి, శాలువాలతో సత్కరించారు,
యాదాద్రి లక్ష్మీనరసింహ ప్రతిమను,తాజా పండ్లను బహూకరించారు.బీఆర్ఎస్ ప్రతినిధి బృందానికి నరసింహన్ తేనీటి విందునిచ్చి కొద్దిసేపు ఇష్టాగోష్టి జరిపారు.