Vaikuntha Shobha Yatra | ఘనంగా ఆలయాల్లో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం

Vaikuntha Shobha Yatra | నల్గొండ, ఆంధ్రప్రభ : ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం పురస్కరించుకొని ఇవాళ‌ జిల్లా కేంద్రంలోని రామగిరిలో ఉన్న రామాలయంతో పాటు పానగల్లు రామాలయం, సిద్ధార్థ కాలనీ డీవీకే రోడ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంతో పాటు పలు ఆలయాల్లో వైకుంఠ శోభ యాత్ర భక్తులు ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలను ఆయా కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలతో ఆలయాలను ఏర్పాటు చేసి తెల్లవారుజామునే ఆలయ అర్చకులు వేదమంత్రోత్సవాల మధ్య స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Vaikuntha Shobha Yatra

అనంతరం భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివార్ల‌ను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. రామగిరి రామాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. రామగిరి రామాలయంలో శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు ఆయనను దర్శించుకున్నారు.

మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి చైతన్య రెడ్డి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా జడ్జి నాగరాజు దంపతులు ప్రత్యేక దర్శనం చేసుకుని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా టూ టౌన్ సీఐ రాఘవరావు, ఎస్సై సైదులు పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, స్వామివారిని దర్శించుకున్నారు.

Leave a Reply