operation | 40మంది పోకిరీలకు కౌన్సెలింగ్

operation | 40మంది పోకిరీలకు కౌన్సెలింగ్

operation | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మల్కాజిగిరి పరిధిలో అర్ధరాత్రి సమయంలో పోలీస్ కమిషనర్ సుమతి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో పోకిరీల అసభ్య ప్రవర్తన బయటపడింది. సీపీగా కాకుండా సాధారణ మహిళగా బస్టాండ్‌లో నిల్చొని పరిస్థితిని అంచనా వేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

సుమారు 40మంది యువకులు ఆమెను చుట్టుముట్టి అనుచిత ప్రశ్నలతో వేధించినట్లు తెలిసింది. వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే స్పందించిన పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుని, కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని, ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.