న్యూ ఢిల్లీ – సివిల్స్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. తుది ఫలితాలను యూపీఎస్సీ కాసేపటి క్రితం ప్రకటించింది. మొతం 1009 అభ్యర్ధులు సివిల్స్ లో ర్యాంకులు సాధించారు.. ఇందులో ఐఎఎస్ కు 180 మంది, ఐఎఫ్ఎస్ కు 55, ఐపిఎస్ కు 147 మంది ఎంపికయ్యారు., తాజాగా వెలువడిన ఫలితాల్లో శక్తి దూబేకు మొదటి ర్యాంకు లభించగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన సాయి శివాని 11వ ర్యాంకు, బన్నా వెంకటేశ్ 15వ ర్యాంకు సాధించారు. అదేవిధంగా శ్రవణ్ కుమార్ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్ కు 68 ర్యాంక్ సాధించారు. 2024 జూన్‌లో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు సుమారు 5 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరు కాగా.. మెయిన్స్‌లో 2,845 మంది ఉత్తీర్ణులై.. ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి ప్రిలిమినరీ పరీక్షకు 42,560 మంది హాజరు కాగా.. అందులో సుమారు 500మంది మెయిన్స్‌కు, 100 మందికి పైగా ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. ఈ ఫలితాల్లో 1,009 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా, ఇందులో జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్యూఎస్ నుంచి 109, ఓబీసీ నుంచి 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీలో 87 మంది చొప్పున ఎంపికయ్యారు.
టాప్ టెన్ ర్యాంకర్స్ వీరే..
యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో శక్తి దూబే మొదటి ర్యాంక్ సాధించారు. హర్షకి గోయ్ రెండో ర్యాంక్ సాధించారు. డోంగ్రే అర్చిత్ పరాగ్ 3వ ర్యాంక్, షా మార్గి చిరాగ్ 4, ఆకాష్ గార్గ్ 5, కోమల్ పూనియా 6, ఆయుషి బన్సల్ 7, రాజ్ కృష్ణ ఝా 8, ఆదిత్య విక్రమ్ అగర్వాల్ 9, మయాంక్ త్రిపాఠి 10వ ర్యాంకు సాధించారు.

