రుద్రంగి పోలీస్ స్టేషన్ కు డీజీ శంకుస్థాపన

రుద్రంగి, ఆంధ్రప్రభ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు 24 గంటల పాటు పనిచేస్తున్నారని వారికి మెరుగైన వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజలతో మమేకమై పనిచేయాలని సమస్యలతో వచ్చే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్,జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గీతే తో పాటు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
