Polling Ends | ముగిసిన పోలింగ్‌.. కొనసాగుతున్న కౌంటింగ్‌

Polling Ends | ముగిసిన పోలింగ్‌.. కొనసాగుతున్న కౌంటింగ్‌

త‌గ్గిన పోలింగ్ శాతం

Polling Ends | వెబ్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ‌లో పంచాయ‌తీ ఎన్నిక‌ల (Election) రెండో విడ‌త పోలింగ్ చ‌దురుమ‌దురు సంఘ‌ట‌నలు త‌ప్ప మిగిలిన ప్రాంతాల్లో ప్రశాంతంగా జ‌రిగింది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి వార్డు సభ్యులు, సర్పంచ్ ఓట్లను వేరు చేసి లెక్కిస్తున్నారు. మొదటి విడత కంటే రెండో విడతలో పోలింగ్ శాతం తగ్గింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 80.84 శాతం పోలింగ్ నమోదు అయింది. మొద‌టి విడ‌త‌లో 84.28 శాతం పోలింగ్ నమోదయింది.

3,912 పంచాయ‌తీల్లో పొలింగ్‌
రాష్ట్రంలో ఈ రోజు సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ (Polling) జ‌రిగింది. రెండో విడ‌త‌లో 4,332 పంచాయతీలకు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో 415 గ్రామాల్లోని స‌ర్పంచ్ ప‌ద‌వుల‌కు ఎన్నిక ఏక‌గ్రీవ‌మ‌య్యారు. మిగిలిన 3,912 స‌రంచ్ ప‌ద‌వుల‌కు 18,128 మంది పోటీపడుతున్నారు. ఈ రోజు పోలింగ్ పూర్త‌యింది. అలాగే 38,322 వార్డులకు నోటిపై కాగా, అందులో 107 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 8,304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29,311 వార్డులకు పోలింగ్ జ‌రిగింది. ఈ వార్డులకు జరిగే ఎన్నికల్లో 78,158 మంది అభ్య ర్థులు పోటీ ప‌డుతున్నారు.

Leave a Reply