వడదెబ్బకు తట్టుకోలేకపోవడంతో..

వడదెబ్బకు తట్టుకోలేకపోవడంతో..


కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ 34 డివిజన్ శివనగర్ కు చెందిన ఉపాధ్యాయ సంఘం నాయకుడు పెరుగు శ్రీనివాస్ సతీమణి పెరుగు లక్ష్మి (56) ఆకస్మికంగా మృతి చెందారు. గత రెండు రోజుల నుండి పెరిగిన ఉష్ణోగ్రతకు తట్టుకోలేక అస్వస్థకు గురయ్యారు. వెంటనే స్థానికులు 108 కు సమాచారం అందించారు. అయితే.. 108 సిబ్బంది వచ్చి పరీక్షించగా అప్పటికే పెరుగు లక్ష్మి మృతి చెందారని తెలిపారు.

ఈ విషయం తెలియగానే పలు ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధులు, స్థానిక ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు మృతురాలు స్వగృహానికి చేరుకొని నివాళులు ఘటించారు. మృతురాలికి కుమారుడు కూతురు ఉన్నారు. ఉపాధ్యాయుడు పెరుగు శ్రీనివాస్ ను ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పెద్దూరి పెద్దన్న, వేసాల జగతయ్య, ఇంద్రకరణ్ రెడ్డి, బత్తుల శ్రీధర్, బత్తుల సత్యం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply