Revanthreddy | వేదపాఠశాల నిర్మాణానికి భూమిపూజ

Revanthreddy | వేదపాఠశాల నిర్మాణానికి భూమిపూజ
Revanthreddy | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : యాదగిరిగుట్ట టెంపుల్ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కంచికామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు.
యాదగిరిగుట్ట క్షేత్రంలో 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న వేదపాఠశాలకు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ పాఠశాల ద్వారా వేద విద్యాభివృద్ధికి ప్రాధాన్యం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
అనంతరం యాదగిరిగుట్టలో రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనులతో క్షేత్రంలో మౌలిక వసతులు మరింత మెరుగుపడనున్నాయని అధికారులు పేర్కొన్నారు.

