ఉడుగుల ప్రచార జోరు …

ఉడుగుల ప్రచార జోరు …

  • 17 వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి ఉడుగుల కిష్టయ్య ..

జనగామ, ఆంధ్రప్రభ : ఆదరించండి అండగా నిలవండి మన 17 వార్డుని మనం అభివృద్ధి చేసుకుందామని మున్సిపల్ పోరు లో 17వ వార్డు నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉడుగుల కిష్టయ్య అన్నారు. శుక్రవారం 17వ వార్డు పరిధిలో తన మద్దతుదారులు బిఆర్ఎస్ నాయకులు,మహిళల తో కలిసి ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఓటర్లను కలుసుకొని మద్దతు కోరారు. అధికార పార్టీ 420 హామీలతో అబద్దాల కోరుగా మారిందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలు హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేకపోయారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని అన్నారు . 17 వ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే నా ధ్యేయమని అందుకు మీ అందరి అండా దండా కావాలని అభ్యర్థించారు.

17వ వార్డులో తాగునీటి సదుస్య పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తానన్నారు. అదేవిధంగా సిసి రోడ్లు డ్రైనేజీ నిర్మాణం విద్యుత్తు సదుపాయంతో పాటు తాగునీరు ఇబ్బందులు లేకుండా కృషి చేస్తానన్నారు. బిఆర్ఎస్ ద్వారా మాత్రమే మున్నిపాలిటీ అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిన ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. తెలంగాణ కోసం పోరాడి సాధించిన బిఆర్ఎస్ పార్టీలోనే అభివృద్ధి సాధ్యమని అందుకు ఎన్నికల్లో మీరంతా తనను ఆదరించి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి 17 వ వార్డు నుండి కౌన్సిలర్ గా గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. వార్డు ప్రజల సేవ కోసం అందుబాటులో ఉంటానని తనను ఆదరించమని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply