రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం..

రాజీవ్ గాంధీ ఆశయాల సాధన కోసం..
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : దేశ సేవలో ప్రాణత్యాగం చేసిన మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నర్సంపేట మండల పరిధిలోని ఇటుకాలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు. గ్రామ సర్పంచ్ మెరుగు సుమలత శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మెరుగు సుమలత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. దేశ ఆధునికీకరణకు, యువత అభివృద్ధికి, సమాచార సాంకేతిక రంగానికి పునాది వేసిన మహానేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, విద్యా రంగ ప్రగతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎండి అఫ్జల్, మాజీ ఉపసర్పంచ్‌లు, మాజీ అధ్యక్షులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, మండల ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు మరియు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొని రాజీవ్ గాంధీకి ఘన నివాళులు అర్పించారు.
