Madhya Pradesh | కూనో పార్క్‌లో చిరుతకూనల జననం..
మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్‌లో రెండు చిరుత కూనలు పుట్టాయి. వీరా అనే ఆడ చిరుత రెండు ఆడ చిరుతకూనలకు జన్మనిచ్చింది. కునో నేషనల్ పార్క్‌లో రెండు చిరుత పిల్లలు పుట్టాయంటూ… మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సోషల్ మీడియాలో సంతోషం వ్యక్తం చేశారు.
ఈ చొరవకు సహకరించిన అధికారులు, పశువైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బంది అందరినీ ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో పెరుగుతున్న చిరుతల సంఖ్యతో పర్యాటక రంగం గణనీయమైన ప్రోత్సాహాన్ని పొందుతుందని, ఉపాధి అవకాశాలకు ద్వారాలు తెరుస్తున్నాయని ముఖ్యమంత్రి హైలైట్ చేశారు.
కాగా, ఈ రెండు చిరుత పిల్లలతో కునో నేషనల్ పార్క్‌లో మొత్తం చిరుతల సంఖ్య 26కి చేరుకుంది. ఇందులో 12 పెద్ద చిరుతలు.. 14 చిరుత పిల్లలు ఉన్నాయి.