TG | ఎస్సీ వర్గీకరణకు శాసనమండలి ఆమోదం !
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు శాసనమండలి ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదిక సారాంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఎస్సీలలో మొత్తం 59 ఉపకులాలను గుర్తించగా, ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఇక ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన కొద్దిసేపటికే శాసనమండలి వాయిదా పడింది.