Triveni Sangha | భక్తికి మరో పేరు..

Triveni Sangha | భక్తికి మరో పేరు..

  • పాదయాత్రగా మల్లన్న గుట్టకు తరలిన లొంగన్ గ్రామస్తులు

Triveni Sangha | జుక్కల్, ఆంధ్రప్రభ: కామారెడ్డి జిల్లాలోనే జుక్కల్ నియోజకవర్గం భక్తికి మరో పేరుగా నిలుస్తుంది. ఈ నియోజకవర్గంలో సంవత్సరానికి ఆరునెలలు ప్రజలు అఖండ హరినామ సప్తాలు, భజన కీర్తనలు, దైవభక్తి మార్గంలో పాదయాత్రలు నిర్వహిస్తుంటారు. ఉపవాసాలు నిర్వహిస్తుంటారు.

కర్ణాటక, మహారాష్ట్రకు సరిహద్దులో జుక్కల్ నియోజకవర్గం ఉండటంతో దీనిని త్రివేణి సంఘమం(Triveni Sangha)గా కూడా పిలుస్తుంటారు. జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామస్తులు సంగారెడ్డి జిల్లా(Sangareddy District) ఝరాసంగం మండలంలోని కుప్పానగర్, చిల్లపల్లిలో గల మల్లయ్యగిరి (మల్లన్నగుట్ట) ఆశ్రమానికి పాదయాత్రగా తరలివెళ్లారు.

ఈ పాదయాత్ర దాదాపు 110 కి.మీ(110 km) సాగనుంది. పాదయాత్రలు వెళ్లిన భక్తులు మల్లయ్యగిరి దేగలమడి ఆశ్రమ పీఠాధిపతి మహా తపస్వి శ్రీ బసవలింగ అవధూతను దర్శించుకుని వారి ఆశీర్వాదాన్ని పొందనున్నారు. ఈ సందర్భంగా లొంగన్ గ్రామం భజన కీర్తనలతో మారుమోగింది. పదుల సంఖ్యలో భక్తులు, భజన బృందం ఈపాదయాత్రలో తరలివెళ్లగా, గ్రామ పెద్దలు పొలిమెర వరకు ఈ పాదయాత్రను సాగనంపారు.

దీంతో పాటు మార్గమధ్యంలో అయ గ్రామాల్లో ఈ పాదయాత్రకు భక్తులు ఘన స్వాగతం(welcome) పలకడమే కాకుండా, వారికి ఫలహారం, భోజన వసతి సైతం కల్పించారు. గ్రామానికి చెందిన గోవింద్ మహారాజ్(Govind Maharaj), శంకర్ మహారాజ్, కోరే శంకర్, రామ్ గొండ, మచ్కురి మారుతి, శంకర్ గొండ, జల్బ మహారాజ్ భక్తులు ఉన్నారు.