Tributes | ఆర్టీసీ జేఏసీతో భట్టి కీలక భేటీ

Tributes | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ జేఏసీ నాయకులతో కీలక సమావేశం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అలాగే చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, సందీప్ కుమార్ సుల్తానియా, దానా కిషోర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, తదితరులు హాజరయ్యారు.
సమావేశం ప్రారంభంలో ఆత్మహత్య చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్‌కు సంతాపం తెలిపారు. ఆయన స్మరణార్థం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సమ్మె పరిస్థితులు, పరిష్కార మార్గాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే ఆశతో కార్మిక సంఘాలు ఎదురుచూస్తున్నాయి.
