AP | రాజమహేంద్రవరంలో విషాదం..
నదిలో దూకిన కుటుంబం
భార్య, ఇద్దరు పిల్లలతో ఇంజినీర్ ఆత్మహత్యాయత్నం..
కుమారుడు ప్రాణాలతో బయటపడినట్టు సమాచారం
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంజినీర్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే వంతెనపై నుంచి నదిలో దూకినట్లు సమాచారం. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
పిఠాపురానికి చెందిన ఇంజినీర్ కుటుంబం ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నలుగురూ నదిలో దూకగా.. ఈత రావడంతో ఇంజినీర్ కుమారుడు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. గమనించిన స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
